Indian Stock Market: భారీ నష్టాల్లో భారతీయ స్టాక్ మార్కెట్.. 1 y ago
ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 1,394.78 పాయింట్లు (1.87%) తగ్గి 73,602.79 వద్ద, నిఫ్టీ 427.50 పాయింట్లు(1.90%) తగ్గి 22,228.80 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మరియు మెక్సికో నుండి దిగుమతులపై 25% టాక్స్ వెయ్యడంతో..అలాగే చైనా నుండి వస్తువులపై అదనంగా 10% టాక్స్ విధించడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకి రావడం లేదు. ఈ కారణంగా చాలా స్టాక్‌లు నష్టపోయాయి. BSE లో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 6.1 లక్షల కోట్లు తగ్గింది. నిఫ్టీ గత 9 నెలలలో కనిష్ట స్థాయికి పడిపోయింది.